భక్తజన సందడితో సికింద్రాపురం లక్ష్మీ నరసింహస్వామి జాతర

సికింద్రాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్