పిడుగు క్షణాల్లో తల్లిని కబళించింది

నర్సాపూర్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన విట్టల్ సరిత (38) తన కుమారుడితో కలిసి పొలం వద్ద గేదెలను మేపుతుండగా, సాయంత్రం సుమారు 4.30 గంటలకు ఉరుములతో కూడిన పిడుగు ఆమెపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కొద్దిదూరంలో ఉన్న ఆమె కుమారుడు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. తల్లిని కోల్పోయిన బాలుడి పరిస్థితి గ్రామస్థులను కలచివేసింది.

సంబంధిత పోస్ట్