మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోతనశెట్టిపల్లి వై జంక్షన్ వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.