రామాయంపేట సీఐ సైదా, స్కూల్, కాలేజీ అడ్మిషన్ల పేరుతో సీట్లు ఇప్పిస్తామని వచ్చే సైబర్ మోసగాళ్ల ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ పేమెంట్లు చేయకుండా, నేరుగా విద్యాసంస్థల్లోనే ఫీజులు చెల్లించాలని తెలిపారు. ఒకవేళ మోసపోతే వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.