వెల్దుర్తి మండల కేంద్రంలో ఎనిమిది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెడికల్ సిద్ధిరాములు మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. గత 40 ఏళ్లుగా వెల్దుర్తిలో మెడికల్ షాపు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన ఆయన మృతితో స్వగ్రామం కుకునూరులో విషాదం నెలకొంది. మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.