బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: మంత్రి

వెల్దుర్తికి చెందిన పానుగంటి మైసయ్య పిడుగుపాటుతో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. వెల్దుర్తి పర్యటన సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం మంత్రిని కలిసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ద్వారా కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని మంత్రి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని మంత్రి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్