నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆమె పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.