శివంపేట మండలం చిన్నాపూర్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.