ప్రీ-ప్రైమరీ స్కూళ్లలో ఎమ్మెల్యే అక్షరాభ్యాసం

కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి, పోతంశెట్టిపల్లి, రాంపూర్, రంగంపేట గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ పాఠశాలలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్