మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవ సభ గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా హనుమకొండ జిల్లాలో జరగనున్న రజతోత్సవ సభ విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని ఎమ్మెల్యే సూచించారు.