సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నాగారం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు కేటీ నాయక్ రూపొందించిన "నా స్లేట్" అనే బోధన సాధనం అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానాన్ని సులభంగా నేర్పడంలో విద్యార్థుల పఠనం, లేఖనం మెరుగుపరచడంలో ప్రశంసలు అందుకుంది. ఈ ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు లభించాయి. ఈ సాధనాన్ని అన్ని పాఠశాలలకు అందించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.