తూప్రాన్ పట్టణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లింపుల్లో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా పన్ను చెల్లించే వారికి 5% రాయితీ లభిస్తుందని, ఈ అవకాశానికి నేటితో ముగింపు ఉంటుందని తెలిపారు. పట్టణానికి రూ. 317. 26 లక్షల ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ. 87. 91 లక్షలు మాత్రమే (27 శాతం) వసూలైనట్లు వివరించారు.