హత్నూర మండలం షేర్ ఖాన్‌పల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారి తీవ్ర గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా నల్ల పోచమ్మ ఆలయం వద్ద చిన్నపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారుతోంది. వాహనదారులు, గ్రామస్తులు, భక్తులు ఈ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.