నర్సాపూర్: మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

నర్సాపూర్ మండలం జైరాంతండాకు చెందిన మెఘావత్ భుజాలీ(52) మిస్సింగ్ కేసును శనివారం పోలీసులు చేధించారు. అయ్య గారిపల్లెకు చెందిన పాత నేరస్థుడు, కెథావత్ గోపాల్ డబ్బుల కోసం ఆమెను హత్య చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మద్యం తాగించి ఉరేసి హత్య చేసినట్లు చెప్పారు. మార్చి 25న భుజాలీ మిస్సింగ్ పై కేసు నమోదైంది. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్