ఇమాంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

మంగళవారం, తూప్రాన్ మండలం ఇమాంపూర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలానికి చెందిన విద్యుత్ శాఖ ఆర్టిజన్ చిత్తారి బిక్షపతి (50) మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై తూప్రాన్ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్