కొల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసార పరికరాలు పనిచేయకపోవడంతో రైతు నేస్తం కార్యక్రమం నిలిచిపోయింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినా, పరికరాలు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాదిలోపే పరికరాలు చెడిపోవడంతో రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.