నర్సాపూర్ లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. స్థానిక శివాలయం వద్ద మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ మహిళలు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్