కొల్చారం తహశీల్దార్ శ్రీనివాసరావు ఇసుక అవసరాల కోసం "ఇసుక వాహనం పోర్టల్" ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా లబ్ధిదారులకు నేరుగా, పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న వారు తప్పనిసరిగా అప్లై చేయాలని, దీంతో సమయానికి ఇసుక అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.