శివంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన మహిళ పిడుగు పడి శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన సత్యమ్మ, శ్రీకాంత్ వ్యవసాయ పనులు చేస్తున్నారు. వర్షం కురవడంతో చెట్టు కిందకు వచ్చారు. పిడుగు పడడంతో సత్తమ్మ మృతి చెందింది. గాయపడిన శ్రీకాంత్ ను నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.