వామ్స్-2026లో అంతరిక్ష, ఏరోస్పేస్ నిపుణుల సందడి

నర్సాపూర్ బీవీఆర్ఐటీలో జరుగుతున్న 5వ ఐఈఈఈ వామ్స్-2026 అంతర్జాతీయ సదస్సు మూడో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో భారత అంతరిక్ష మంత్రిత్వ శాఖ సాంకేతిక విభాగం డైరెక్టర్ రాజీవ్ జ్యోతి పరిశ్రమ-విద్యారంగ భాగస్వామ్యంపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. ఇస్రో, సీఎస్ఐఆర్–నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలు కూడా హాజరయ్యారు. 18 దేశాల ప్రతినిధులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఈ సదస్సుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్