మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో గల శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఆదివారం నాడు ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.