తూప్రాన్ రేషన్ గిడ్డంగి వద్ద ఉద్రిక్తత

తూప్రాన్ పౌరసరఫరాల గిడ్డంగి వద్ద లారీల నుంచి బియ్యం దిగుమతి చేస్తున్న సమయంలో రేషన్ డీలర్లు, హమాలీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బియ్యం నాణ్యతపై తలెత్తిన అభిప్రాయ భేదాలు మాటామాటా పెరిగి అరగంటపాటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అనంతరం స్థానికులు, గిడ్డంగి సిబ్బంది జోక్యంతో ఇరువర్గాలు శాంతించగా, పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనతో కొంతసేపు గిడ్డంగి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్