మెదక్: నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్సై రాజు తెలిపారు. ఈనెల 5న అరెగూడెం గ్రామానికి చెందిన హనుమద్రి లక్ష్మయ్య, ఇంటికి వేసిన తాళం పగులగొట్టి, ఇంట్లో చెక్క పెట్టెలో పెట్టిన రూ. 90 వేలు దొంగలించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కుస్తీ కార్తీక్ (23)పై అనుమానం రావడంతో గురువారం అదుపులోనికి తీసుకొని విచారించగా దొంగతనం ఒప్పుకున్నాడు.

సంబంధిత పోస్ట్