ట్రాక్టర్ బోల్తాపడి ఒక బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. నారాయణపూర్ గ్రామానికి చెందిన వినయ్ అనే (15) బాలుడు తమ బంధువులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు ట్రాక్టర్ నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అది బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.