మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డీసీఎం రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. డీసీఎంలో ఉన్న డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు డ్రైవర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.