జీవులన్నింటిలో మేధాశక్తితో ఆలోచించే సామర్థ్యం కేవలం మనిషికే ఉంటుందని కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. విద్యార్థులు తమ మేధోసంపత్తిని నిరంతరం పెంపొందించుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవడం ఎంతో అవసరమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సమాజం పట్ల మరింత బాధ్యత కలిగి ఉండాలని ఆయన సూచించారు.