మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి పడాలపల్లిలో పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కురుస్తుండడంతో పడాలపల్లి శివారులో చెట్టు కింద నిలబడిన పంబాల ప్రసాద్ (16), నడిపల్లి యశ్వంత్ (14), మొఖద్దం కిరణ్ లపై పిడుగు పడింది. దీంతో ప్రశాంత్, యశ్వంత్ మృతి చెందగా, కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.