ఆరెగూడెం గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఏర్పుల నవీన్ ఇంట్లో తాళాలు పగులగొట్టి అర తులం బంగారం, వెండి వస్తువులను అపహరించారు. సాకలి భాగ్య ఇంట్లో రూ. 10 వేల నగదు, ఐదు తులాల వెండి వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరుస చోరీలతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్