నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివానందం హెచ్చరించారు. పట్టణంలో ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నాలుగు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన వారి వాహన లైసెన్సులను రద్దు చేసి, చట్ట ప్రకారం జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.