వెల్దుర్తిలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి నాణ్యత కోల్పోతోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతులు అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ కేంద్రానికి వచ్చి అధికారులను వేడుకుంటున్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.