మనోహరాబాద్ మండల కేంద్రంలో ఆషాఢ మాసం ఆదివారం పురస్కరించుకొని బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బోనాల జాతర పురస్కరించుకుని మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదివారం ఉత్సవాలకు హాజరయ్యారు. ముత్యాలమ్మ అమ్మవారిని మైనంపల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, మండల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.