కొల్చారం కేంద్రంలో వివోఏల సమ్మె

కొల్చారం మండల కేంద్రంలో వివోఏలు గురువారం నిరవధిక సమ్మె చేపట్టారు. కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలని, తమను సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సీసీలుగా పదోన్నతులు కల్పించి ఆరోగ్య బీమా సదుపాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన వివోఏలు, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్