రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళకు త్రివ్ర గాయాలు

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం సమీపంలో బుధవారం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్