మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రంలో శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మైలలు తీసే కార్యక్రమంతో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. మొదటి రోజు గ్రామంలో అమ్మవారి విగ్రహ ఊరేగింపు చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం సోదరులు తెలిపారు.