కాజీపల్లి: రియాక్టర్ వద్ద ఒక్కసారిగా చెలరేగిన మంటలు

కాజీపల్లిలోని అరోరా లైఫ్సెన్సెస్ పరిశ్రమలో తెల్లవారుజామున రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్మికులు, పరిశ్రమ యాజమాన్యం ఫైర్ ఇంజిన్లకు సమాచారం ఇచ్చారు. పటాన్చెరు, జీడిమెట్ల, నర్సాపూర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి గురువారం పరిశ్రమను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్