జిన్నారం మండలంలో చల్లబడిన వాతావరణం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మోస్తారు వర్షం కురిసింది. మండల పరిధిలోని జంగంపేట, అన్నారం, వావిలాల, తదితర గ్రామాలలో మోస్తారు వర్షం కురిసింది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.

సంబంధిత పోస్ట్