సంగారెడ్డి: లారీలో చెలరేగిన మంటలు ఒకరు మృతి

కాజిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో టిప్పర్ కు మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికుడు రాం సుజన్ తో పాటు టిప్పర్ లారీ వాహనం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆన్ లోడ్ చేస్తున్న ప్రదేశంలో పైన విద్యుత్ వైర్లు చూసుకోకుండా హైడ్రాలిక్ ను పైకి లేపడంతో విద్యుత్ వైర్లు తగిలింది. బొల్లారం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్