పటాన్ చెరు: వలస వచ్చిన కూలీ మిస్సింగ్

మహారాష్ట్రకు చెందిన సోమ మంగళ గాత్రే పటాన్ చెరు మండల్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక నిర్మాణ సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 20 వ తేదీ పనికి వెళ్లి తిరిగి రాలేదు. దానితో తోటి గ్రామస్తులు గ్రామానికి వెళ్ళాడేమో అనుకున్నారు. గ్రామానికి వెళ్లిన మరో స్నేహితుడిని అడగగా రాలేదు అని తెలిసింది. వెంటనే వారు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్