పాశమైలారంలోని ఒక పరిశ్రమంలో సెక్యూరిటీ గార్డు హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పటాన్చెరు డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన పనామాలోని ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ ఖైరత్ మియాను హత్య చేసి దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.