సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్ స్కూల్‌కు శుక్రవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. తన కుమారుడు మార్క్ శంకర్ అడ్మిషన్ తీసుకునేందుకు ఆయన స్వయంగా పాఠశాలకు వచ్చారు. ఇటీవల సింగపూర్ పాఠశాలలో అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కొడుకును ఆయన హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్రిశాట్ స్కూల్లో చేర్పించారు.