భార్యాభర్తల మధ్య గొడవలతో విసుకు చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కు కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మనస్థాపం చెంది వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.