సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాటి గ్రామ శివారులోని డైమండ్ బ్రిక్స్ కంపెనీలో శనివారం ప్లాంట్ లో మిక్సర్ ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒరిస్సా కు చెందిన దినేష్ బోయి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి బీడీఎల్ బానూరు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు.