సదాశివపేట: మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

సదాశివపేట మండలం పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన మైటాఫ్ (58) అనే వ్యక్తి మంగళవారం రాత్రి మద్యం సేవించి మద్యం మత్తులో ఎలుకల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా బుధవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతుని బంధువులు సదాశిపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్