సంగారెడ్డిలో అత్త, మామ గొడవ పడుతున్నారని.. కోడలు అదృశ్యం

అత్తమామలు గొడవ పడుతుంటే తన గురించే గొడవ పడుతున్నారని ఓ మహిళ అదృశ్యమైన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. సీఐ రమేష్ కథనం ప్రకారం. శాంతినగర్‌కు చెందిన మల్లికార్జున్ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఆవమ్మ (26) గృహిణిగా ఇంట్లో ఉంటుంది. అత్తమామలు శశికళ, గురప్ప తన గురించే గొడవ పడుతున్నారని అవమ్మ అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్