పెండింగ్ బకాయిలు విడుదల చేయాలను కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం పాత్రలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.