సంగారెడ్డి పట్టణంలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం బుధవారం కురిసింది. భారీ వర్షం కురవడంతో కూతురుపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారి జలమయమైంది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది.