సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణ ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకొని భారీగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. మండల పరిధిలోని జంగంపేట, వావిలాల, శివానగర్, కొడకంచి, ఊట్ల తదితర గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలయంగా మారాయి. వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.