కంది మండలం బ్యాతోల్, చిద్రుప్ప గ్రామాల్లో అక్రమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు మంగళవారం కూల్చివేశారు. తహసిల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో ఇసుక ఫిల్టర్లను తొలగించారు. తహశీల్దార్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుక కృత్రిమంగా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.