కంది: మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడి

మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన కందిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల యువతిపై అదే గ్రామానికి చెందిన మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు నిందితున్ని సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్