కొండాపూర్ మండలం మల్కాపూర్ జాతీయ రహదారిపై కారు టైరు పేలి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మహమ్మద్ మొహరోజ్ కారులో కోహీర్ వెళ్తున్నారు. మల్కాపూర్ వద్ద కారు టైరు పేలింది. మహమ్మద్ మొహరోజ్ అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారికి స్వల్ప గాయలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.